సహన శక్తి సన్నగిల్లింది: వాజ్‌పేయి
మనాలి (హిమాచల్ ప్రదేశ్): భారత సహన శక్తి సన్నగిల్లుతోందని, సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పేలా పాకిస్థాన్‌పై ఒక ఒత్తిడి తేవాల్సింది ప్రపంచ నేతలేనని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు.
బహుత్ ప్రతీక్షా కర్ లీ హై. అబ్ హమారీ ప్రతీక్షా సమాప్త్ హోరహీ హై (మనం చాలా కాలం నిరీక్షించాం. ఈ నిరీక్షణ దగ్గరపడుతోంది) అని ఆయన శనివారం అన్నారు. గిరిజనుల సాంస్కృతిక కార్యక్రమాలను సందర్శించిన అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడారు.
పాకిస్థాన్ చేస్తున్న క్షిపణి ప్రయోగాలను తాముసీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. కాశ్మీర్‌పై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) చేసిన తీర్మానంపై వేసిన ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ ఉగ్రవాదంపై పోరువిషయంలో కాంగ్రెస్ వైఖరి మారలేదని చెప్పారు. కాశ్మీర్ పాలసీపై కాంగ్రెస్ విభేదించవచ్చునని, అయితే ఉగ్రవాదంపై పోరువిషయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని బలపరుస్తున్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
