ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్
హైదరాబాద్: కరెంట్ ఛార్జీలపెంపుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచివిశేస స్పందన లభించింది. అత్యధిక ప్రజలు కరెంట్ ఛార్జీలపెంపును వ్యతిరేకిస్తున్నట్లు ప్రజా బ్యాలెట్‌లో తేలింది.
చిత్తూరు జిల్లాలోని 65 కేంద్రాల్లో ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. కర్నూలు కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఒక శాతం మంది మాత్రమే కరెంట్ ఛార్జీలపెంపును సమర్థించారు. రాజమండ్రిలో 17 చోట్ల ప్రజాభిప్రాయసేకరణకు ఏర్పాట్లు చేశారు. న్యాయవాదులు, పత్రికా ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్లను లెక్కించారు.
కాంగ్రెస్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరంగల్ తెలుగుదేశం మహానాడులో తీవ్రంగావిమర్శించారు. అది ప్రజా బ్యాలెట్ కాదని, కాంగ్రెస్ బ్యాలెట్ అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications