మనాలి: వాగ్దానం చేసిన మేరకు పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో చెప్పారు. భారత్ ఓపిక నశిస్తోందని కూడా ఆయన అన్నారు.
ఇక ముందు ముషార్రఫ్ ఏ హామీ ఇచ్చిన అది అమలు కావాలని ఆయన అన్నారు. ముఫార్రఫ్‌తో మాట్లాడిన అనంతరం బ్లెయిర్ వాజ్‌పేయితో ఫోన్‌లో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదంవిషయంలో ముషార్రఫ్ జనవరి 12వ తేదీన చేసిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో దేశ ఆగ్రహంపెల్లుబుకుతోందని వాజ్‌పేయి చెప్పారు.