హైదరాబాద్: పీపుల్స్‌వార్‌ప్రతినిధులతో చర్చలు జరిపే తన ప్రతినిధులపేర్లను ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. ఆబ్కారీ మంత్రి తమ్మినేనిసీతారాం, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి విజయరామారావుపేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
ప్రభుత్వ ప్రతినిధులుగా ఈ ఇద్దరు మంత్రులుపీపుల్స్‌వార్ ప్రతినిధులు వరవరరావు, గద్దర్‌లతో చర్చలు జరుపుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారిద్దరికీ ఒక లేఖ రాసింది.పీపుల్స్‌వార్, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య చర్చలు బుధవారం హైదరాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వ్యూహాత్మకంగానేవిజయరామారావును, సీతారాంను తన ప్రతినిధులుగా ఎంపిక చేసింది. రాజకీయ ప్రతినిధులనే చర్చలకు పంపిస్తామని ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించింది. అయితే ఈ ఎంపికలో కొంత తెలివిని ఉపయోగించినట్లు కనిపిస్తోంది.విజయ రామారావు పోలీసు శాఖలో అత్యున్నత పదవులు నిర్వహించారు. సిబిఐ డైరెక్టర్‌గా కూడా ఆయన పని చేశారు. తెలంగాణలోనే కాకుండా ఉత్తరాంధ్రలో కూడా నక్సలైట్ల ప్రాబల్యం గణనీయంగానే ఉంది. ఈ దృష్ట్యా ఉత్తరాంధ్రలోనిశ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంను మరో ప్రతినిధిగా ఎంపిక చేసింది. నక్సలైట్ల సమస్య తీవ్రంగా వున్న తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన మంత్రులను ప్రతినిధులుగా ఎంపిక చేయకపోవడం గమనార్హం.