అహ్మదాబాద్: భావనగర్‌లోని ప్రభుతలవ్ ప్రాంతంలో విధ్వంసానికి దిగిన అల్లరి మూకలను చెదరగొట్టడానికి సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు కనీసం పది రౌండ్లు కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్‌షెల్స్ వదిలారు.
పోలీసు కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఇరు వర్గాలకు చెందిన అల్లరి మూకలు పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ విధ్వంసానికి దిగాయి. ఒక ఇంటికి నిప్పంటించాయి. ఈ సమయంలో కరెంట్ లేదు. పరిస్థితి అదుపులో వున్నదని పోలీసులు చెప్పారు.