భారత్‌ చర్చలకు రావాలి: ముషార్రఫ్‌

ఆల్మాటీ: భారత్‌తో తాము యుద్ధాన్నికోరుకోవడం లేదని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ మంగళవారం అన్నారు. అన్ని రూపాల్లోని తీవ్రవాదాన్ని తమ దేశం తిరస్కరించిందని ఆయన చెప్పారు. న్యూఢిల్లీ చర్చల దారికి రావాలని ఆయనవిజ్ఞప్తి చేశారు.

నిందలకు, బెదిరింపులకు, ప్రమాదకరమైనసేనల మోహరింపునకు బదులు భారత్‌ చర్చల దారికి వచ్చి సంప్రదింపులకు జరపాలని, ఇది మాత్రమేసరైన మార్గమని, ముఖ్యంగా దక్షిణాసియాలో నెలకొన్న ప్రమాదకరమైన వాతావరణంలో ఈ మార్గాన్ని అనుసరించడం మంచిందని ఆయన అన్నారు.

భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, రష్యా అధ్యక్షుడువ్లదిమీర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌తో పాటు సదస్సులో పాల్గొంటూ ఆయన మాట్లాడారు. దేశం లోపల గానీ, బయట గానీ తీవ్రవాద కార్యకాలాపాలకు పాల్పడేందుకు తనను వేదికగా చేసుకోవడాన్ని పాకిస్థాన్‌ అనుమతించబోదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+