యుద్ధనివారణకు నడుంకట్టిన రష్యా
ఆల్మాటి: జమ్మూ కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పే వరకు పాకిస్థాన్‌తో చర్చలు జరపాలనే ఇతర దేశాల ప్రయత్నాలకు తలొగ్గబోమని భారత్ సోమవారం స్పష్టం చేసింది. ఆల్మాటీలో కజక్‌స్థాన్‌కు పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్, భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేరుకున్న నేపథ్యంలో భారత్ ఈ ప్రకటన చేసింది.
ఇతర దేశాలు ఏమనుకుంటున్నాయనే విషయంతో తమకు సంబంధం లేదని, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్‌స్వస్తి చెప్పేంత వరకు ఆ దేశంతో చర్చలు జరపబోమని భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లావిలేకరులతో చెప్పారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వాజ్‌పేయితో పాటు ఆయన ఇక్కడికి వచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లో హింస తగ్గి, చొరబాట్లు నిలిచిపోయే వరకు వాజ్‌పేయి ముషార్రఫ్‌తో చర్చలు జరపబోరని, ఈవిషయంలో తమ వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
