8 మంది పాక్ సైనికుల హతం
జమ్మూ: భారత బలగాలు బుధవారం జరిపిన ఎదురుకాల్పుల్లో ఎనమండుగురు పాకిస్థాన్‌సైనికులు హతమయ్యారు. పాకిస్థాన్ బలగాలు భారత స్థావరాలపై దాడి చేసినప్పుడు భారత బలగాలు తిప్పికొట్టాయి. ఇందులో పాక్‌సైనికులు మరణించారు. పాకిస్థాన్ బలగాలు బాటాలిక్- ద్రాస్- కార్గిల్ ప్రాంతాల్లోని 12 భారత బంకర్లను ధ్వంసం చేశాయి.
పూంఛ్, రాజౌరీ, నౌషేరా సెక్టార్లలోని పీర్ పంజల్ రేంజ్‌కు దక్షిణ దిశగా కూడా పాకిస్థాన్ బలగాలుపెద్ద యెత్తున ఫిరంగులను, మోర్టార్లను ప్రయోగించాయి. భారత బలగాలు పాక్ దాడులను ఎదుర్కున్నాయి. ఇందులో పాకిస్థాన్ వైపుపెద్ద యెత్తున ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పలు పాకిస్థానీ పోస్టులు ధ్వంసమైనట్లు సమాచారం.కార్గిల్ ప్రాంతంలో పాక్ బలగాలు జరిపిన దాడిలో ఒక భారత సైనికాధికారి, ఒకస్త్రీ గాయపడ్డారు.












Click it and Unblock the Notifications
