9 అంశాలతో వార్ ప్రతినిధులు రెడీ
హైదరాబాద్: ప్రభుత్వ ప్రతినిధులకు,పీపుల్స్‌వార్ ప్రతినిధులకు మధ్య బుధవారం సాయంత్రం చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. తొమ్మిదిఅంశాలు పీపుల్స్‌వార్ ప్రతినిధులు వరవరరావు, గద్దర్, ప్రభుత్వ ప్రతినిధులువిజయరామారావు, తమ్మినేని సీతారామ్‌ల ముందుంచారు.
వరవరరావు, గద్దర్‌ల నిరసనతో ఇరు పక్షాల మధ్య చర్చల ప్రక్రియ తొలి విడత సమావేశం ప్రారంభమైంది. కరీంనగర్‌లో జనశక్తి నక్సలైట్ బాలన్నను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారని, కరీంనగర్ ఎస్‌పి ప్రవీణ్‌కుమార్ ముందు 26 మంది నక్సలైట్ల లొంగుబాటు నాటకం ఆడారని వరవరరావు, గద్దర్‌విమర్శించారు. అందుకు నిరసన వ్యక్తం చేస్తూ చర్చల ప్రక్రియలో పాలు పంచుకుంటున్నట్లు వారు తెలిపారు.
పీపుల్స్‌వార్ ప్రతినిధులు వరవరరావు, గద్దర్ తొమ్మిదిఅంశాలతో కూడిన లిఖిత పూర్వక పత్రాన్ని ప్రభుత్వ ప్రతినిధులువిజయరామారావుకు, సీతారామ్‌కు అందజేశారు. ఈ అంశాల అమలు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తెలియజేస్తామని ప్రభుత్వ ప్రతినిధులుపీపుల్స్‌వార్ ప్రతినిధులకు తెలియజేశారు.పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తేయాలని, చర్చలకు వచ్చేపీపుల్స్‌వార్ నేతలకు తగిన భద్రత కల్పించాలనిపీపుల్స్‌వార్ ప్రతినిధులు వరవరరావు, గద్దర్ సమావేశంలో డిమాండ్ చేశారు.పీపుల్స్‌వార్ నేతల తలలపై ప్రకటించిన రివార్డులను ఉపసంహరించుకోవాలని,పీపుల్స్‌వార్ నేతలను తాము ఎప్పటికప్పుడు కలుసుకోవడానికి తమకు భద్రత కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. తమ కదలికలపై నిఘా వేయకూడదని వారుకోరారు.
తిరిగి ఈ నెల 9వ తేదీ ఉదయం తొమ్మిదన్నర గంటలకు ప్రభుత్వ ప్రతినిధులకు,పీపుల్స్‌వార్ ప్రతినిధులకు మధ్య సమావేశం జరుగుతుంది.












Click it and Unblock the Notifications
