26మంది నక్సలైట్ల లొంగుబాటు
రాజమండ్రి/ఖమ్మం: తాను ఇక ముందు పంట పొలాలను కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో, ఖమ్మం జిల్లా కిష్టారం గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఆయన బుధవారం పాల్గొన్నారు.
బడికి వెళ్లని పిల్లలను ముఖ్యమంత్రి గ్రామసభలోపేరు పేరునా పిలిచి బడికి వెళ్లకపోవడానికి గల కారణాలేమిటో అడిగి తెలుసుకున్నారు. పని చేస్తున్న గ్రామాల్లో నివసించని ఉపాధ్యాయుల ఇంక్రిమెంట్లు కట్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉపాధి కల్పనకు వచ్చే ఐదేళ్లలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మహిళల కోసం ప్రభుత్వం చాలా నిధులు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. జన్మభూమిపై పనికి మాలిన ప్రకటనలు చేయడం తప్ప కాంగ్రెస్‌కు మరో పని లేకుండా పోయిందని ఆయనవిమర్శించారు.












Click it and Unblock the Notifications
