వాజ్‌ పేయిని కలిసిన చంద్రబాబు

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ప్రధాని వాజ్‌పేయిని కలుసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నిక, పెట్రోల్‌ ధరలపెంపు తదితర అంశాలు వాజ్‌ పేయి - చంద్రబాబు మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడు వెంట తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రం నాయుడు కూడా వున్నారు. బుధవారం నాడే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాల్సి వుండగా జన్మభూమి కార్యక్రమాలు, రాజధానిలోని తెలుగులలితకళా తోరణంలో జరిగిన కార్యక్రమల్లో పాల్గొన్న చంద్రబాబు కాలాతీతం కావడంతో పర్యటనను గురువారం నాటికి వాయిదా వేసుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్న వెంటనే వాజ్‌పేయి నివాసానికి వెళ్ళారు. వాజ్‌ పేయితో గంటకు పైగా ఆయన చర్చలు జరిపారు.

రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ ఎంపికయ్యేలా చంద్రబాబు వ్యూహం రూపొందించుకున్నారు. ములాయం సింగ్‌ కూడా కృష్ణకాంత్‌పేరును సమర్థించడంతో చంద్రబాబు మాట నెగ్గే అవకాశం కనిపించింది. చివరకు కాంగ్రెస్‌ కూడా కృష్ణకాంత్‌కే
మద్దతు ఇచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. అయితే వాజ్‌పేయి మాత్రం పి.సి అలగ్జాండర్‌ ను రాష్ట్రపతి చేయాలని పట్టుదలగా వున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు అభిప్రాయం కీలకంగా మారింది. ఈఅంశాలనే చంద్రబాబు వాజ్‌ పేయితో చర్చించినట్లు భావిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నిక అంశంతో పాటు భారీగా పెట్రోలు ధరలుపెంచిన అంశాన్ని కూడా చంద్రబాబు వాజ్‌ పేయితో చర్చించారు. తన ఒకరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుసుకొని రాష్ట్రంలోని ప్రాజెక్టులపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+