కర్ణాటకకు తరలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ముంబాయి: మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు కర్ణాటకకు తరలిపోయారు. ఫిరాయింపులను నివారించడానికివీరిని కర్ణాటకకు పంపిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాలు చెప్పాయి. తన శాసనసభ్యులను కాంగ్రెస్ మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు పంపించడం ఇదే తొలిసారి.
తమ వైపు వచ్చిన పద్మాకర్ వాల్విని ప్రతిపక్ష నాయకుడు నారాయణ్ రాణేవిలేకరుల ముందు హాజరు పరిచారు. విలాస్ రావు దేశ్‌ముఖ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని తమ వైపు నలుగురు ఎన్‌సిపి శాసనసభ్యులతో పాటు 17 మంది శాసనసభ్యులు వచ్చారని బిజెపి నాయకుడు గోపీనాథ్ ముండేవిలేకరులకు చెప్పారు. తమకు మద్దతు ఇస్తున్నట్లు ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు, 11 మంది ఎన్‌సిపి శాసనసభ్యులు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. ఇండోర్‌లో ఉన్న ఆరుగురు ఎన్‌సిపి శాసనసభ్యులు, ఇద్దరు మంత్రులు తమతో సంప్రదింపులు జరుపుతున్నాని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
