హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అర్థవంతమైన వైఖరి అవలంభించి చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాలనిపీపుల్స్‌వార్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. మీడియా కార్యాలయాలకు గురువారం పంపిన ఒక ప్రకటనలో ఆయన ఈ సూచన చేశారు.
పోలీసు యంత్రాంగం చర్యల వల్ల చర్చలకు సానుకూల వాతావరణం లేకుండా పోతుందని ఆయన అన్నారు. చర్చలకు రాజకీయ లక్ష్యం, చిత్తశుద్ధి వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు పాలకుల మాట వినడం లేదని కరీంనగర్ జిల్లా ఎస్‌పి ప్రవీణ్‌కుమార్ పద్ధతి తెలియజేస్తోందని ఆయన అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌లో జనశక్తి నక్సలైట్ బాలన్నను హతమార్చడం, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌కు దిగడం ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. రాజకీయ ఆచరణ పోలీసుల పని కాదని ఆయన అన్నారు. పోలసుల వైఖరి వల్ల చర్చల ప్రక్రియ వెనుకంజ వేస్తుందని ఆయన అన్నారు. అయితే తాము చర్చల ప్రక్రియను కొనసాగిస్తామని ఆయన అన్నారు.విషయాలు ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశంతోనే ఈవిషయాలు మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.