న్యూఢిల్లీ: ఒక రోజు పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ సహాయ మంత్రి రిచర్డ్ ఆర్మిటేజ్ శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఉదయం ఏడు గంటలకు ఢిల్లీ వచ్చారు.
సరిహద్దులో భారత, పాక్ బలగాల మోహరింపు నేపథ్యంలో తాజా పరిస్థితి గురించి ఆయన ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయితో, ఇతర అగ్ర నేతలతో మాట్లాడుతారు. పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్‌తో సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు గురించి మాట్లాడిన అనంతరం ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మిటేజ్ వాజ్‌పేయితోనే కాకుండా హోం మంత్రి ఎల్.కె. అద్వానీతో, విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్‌తో, జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్‌మిశ్రాతో, ప్రతిపక్ష నేత సోనియాగాంధీతో చర్చలు జరుపుతారు.