విజయవాడలో గ్లోబల్‌ట్రస్ట్ వణుకు
విజయనగరంః ఆంధ్రప్రదేశ్ లో సుస్థిర శాంతి నెలకొనాలనే సంకల్పంతోనే నక్సలైట్లతో చర్చలు ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పరు. నక్సలైట్లు సాయుధపోరాటాన్ని విడనాడాలని ఆయన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయనగరం వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ చెప్పారు. పీపుల్స్ వార్ తో జరుపుతున్న చర్చలు సత్ఫలితాలివ్వాలన్నదే తమ అభిమతం అన్నారు. నక్సలైట్లు సాయుధపోరాటం బాటను వీడాలంటూ పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు పిలుపునివ్వడాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎమ్మెస్సార్ ప్రకటన పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.ఒకవైపు చర్చలు జరుగుతుండగానే నక్సలైట్లు హింసకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్లు గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తునే వున్నారని ఆయన అన్నారు. కాల్పులవిరమణను ప్రకటించిన నక్సలైట్లు ఇంకా హింసకు పాల్పడడంఅర్థరహితం అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
