నక్సలైట్లు దేశభక్తులు: ఎమ్మెస్సార్‌

హైదరాబాద్‌: నక్సలైట్లు తుపాకులు వదిలేస్తే తానుస్వయంగా ముందుకు వచ్చి మద్దతిస్తానని, అవసరమైతే వారి ఉద్యమానికి నేతృత్వం వహిస్తానని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు.పీపుల్స్‌వార్‌ నక్సలైట్లపై నిషేధం ఎత్తేస్తే మంచిదని ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు.

పీపుల్స్‌వార్‌ నక్సలైట్లను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. నక్సలైట్లు దేశభక్తులేనని, వారుదోపిడీదారులు, పిండాకోరులు కారని, పీడిత ప్రజల కోసంసర్వం త్యాగం చేస్తున్న గొప్పవారని ఆయన అన్నారు. గత 30 యేళ్లుగాపీపుల్స్‌వార్‌ తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. నక్సల్స్‌ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆర్థిక, రాజకీయ సమస్యలుగా గుర్తించాలని ఆయన సూచించారు.సాంఘిక, రాజకీయ, ఆర్థిక వెనుకబాటుతనం నుంచి నక్సలిజం ఉద్భవించిందని, అణగారిన ప్రజలకు పూర్తిగా హక్కులను కల్పించినప్పుడే నక్సలిజం పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. నక్సలైట్లతో జరిపే చర్చలు అర్థవంతమైన ముగింపు ధ్యేయంగా ఓపెన్‌ మైండ్‌తో ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన సూచించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+