గ్లోబల్ ట్రస్ట్ కు ఆర్.బి.ఐ. క్లీన్ చిట్
న్యూఢిల్లీః హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్‌ట్రస్ట్ బ్యాంక్ కు ఢోకా లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. జి.టి.బి. ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్నదనే పుకార్లు వ్యాపించడంతో నాలుగు రోజులుగా ఖాతాదారులు ఆ బ్యాంకు నుంచి డబ్బును హడావుడిగా వెనక్కు తీసుకుంటున్నారు. హైదరాబాద్,విజయవాడ, విశాఖపట్నంలలో డిపాజిట్ దారులు సైతం ఆందోళనగా తమ డబ్బు వాపస్ తీసుకున్నారు. అయితే జిటిబి గురించి ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని ఆర్.బి.ఐ. ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
