నిరసనలతో చర్చలకొచ్చిన వార్ ప్రతినిధులు
హైదరాబాద్‌ః పీపుల్స్ వార్ - ప్రభుత్వానికి మధ్య ఆదివారం నాడు సచివాలయంలో రెండో విడత చర్చలు జరిగాయి. వార్ ప్రతినిధులు గద్దర్, వరవరరావు ఎన్ కౌంటర్లకు నిరసనగా ప్లే కార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేసుకుంటూ సచివాలయంలోకి వచ్చారు.
బూటకపు ఎన్ కౌంటర్లపై ప్రభుత్వం విచారణ జరిపించాలని, శాంతి చర్చలకు పోలీసులు ఆటంకం కలిగిస్తున్నారని వారిద్దరూ నినాదాలిచ్చారు. ఇరుపక్షాల మధ్య చర్చలు సజావుగా సాగాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించాలంటూ కూడా వారు నినాదాలిచ్చారు.












Click it and Unblock the Notifications
