న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి తాను మళ్లీ బరిలోకి దిగబోనని రాష్ట్రపతికె.ఆర్. నారాయణన్ స్పష్టం చేశారు. దాదాపు నెల రోజుల పాటు మౌనం వహించి ఊహాగానాలకు, రాజకీయ వ్యూహాలకు ఎట్టకేలకుపెదవి విప్పారు.
నారాయణన్ నిర్ణయంపై కాంగ్రెస్ వైఖరి వెల్లడి కాలేదు. అయితే వామపక్షాలు మాత్రం అబ్దుల్ కలామ్‌ను సమర్థించడానికి సిద్ధంగా లేవు. రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిని బుధవారం ప్రకటిస్తామని వెల్లడించాయి.పీపుల్స్‌ఫ్రంట్‌లో భాగస్వామి అయిన సమాజ్‌వాదీ పార్టీ మాత్రం వామపక్షాలతో విభేదించి కలామ్‌ను సమర్థించడానికి నిర్ణయించుకుంది. రాష్ట్రపతి ఎన్నికవిషయంలో తన వైఖరిని నిర్ణయించుకోవడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం బుధవారం జరుగుతుంది. నారాయణన్ నిర్ణయం వెలువడడానికి ముందు జరిగినపీపుల్స్‌ఫ్రంట్ సమావేశంలో అబ్దుల్ కలామ్ అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.