ఫెర్నాండెజ్ తో రమ్స్‌ఫీల్డ్ భేటీ
న్యూఢిల్లీః అమెరికా రక్షణ శాఖ మంత్రి రమ్స్ ఫీల్డ్ బుధవారం నాడు భారత రక్షమ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ను కలుసుకున్నారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో రమ్స్ ఫీల్డ్ న్యూఢిల్లీ పర్యటనకు వచ్చారు. గురువారం ఆయన ఇస్లామాబాద్ లో కూడా పర్యటిస్తారు. పాకిస్తాన్ కు త్వరలో భారత్ హై కమిషనర్ ను పంపే విషయంపై ఆయన ఫెర్నాండెజ్ తో చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు. ఉద్రిక్తతల నివారణకు భారత్ తీసుకున్న చర్యల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
