చంద్రబాబుకు ముస్లింవర్గాల కితాబు

శ్రీనగర్‌ః సరిహద్దులో అల్‌ ఖైదా తీవ్రవాదుల కదలికలున్నాయని, అవసరమైతే భూతలసెన్సార్లను పంపుతామంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను భారత్‌ సున్నితంగా త్రోసిపుచ్చింది. జమ్ము కాశ్మీర్‌ లో మాటువేసిన అల్‌ ఖైదా దళాలను మట్టుపెట్టేందుకు మరో దేశం సాయం అవసరం లేదని భారత్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. గురువారం ఆయన శ్రీనగర్‌ లోవిలేకర్లతో మాట్లాడుతూ అల్‌ ఖైదా తీవ్రవాదుల్ని తుదముట్టించే సత్తా భారతసేనలకు పుష్కలంగా వున్నదన్నారు. ఇందుకోసం విదేశీసేనల సహాయం భారత్‌ కు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.

భారత్‌ సరిహద్దులో అల్‌ ఖైదా కదలికలు వున్నాయని రమ్స్‌ఫీల్డ్‌ అంగీకరించడం భారత్‌ కు కీలకపరిణామం అని ఆయన చెప్పారు. కాశ్మీర్‌ లో అల్‌ ఖైదా వున్నదని అంతర్జాతీయ దేశాలు ఈ రోజుకైనా కనీసం గుర్తించగలిగాయని ఆయన అన్నారు. ఇంతకాలం భారత దేశం మాత్రమే ఈఅంశంపై ఆందోళన చెందుతూ వున్నది... ఇప్పుడు అమెరికా కూడా భారత్‌ తో ఏకీభవించడం హర్షణీయం అని ఆయన అన్నారు. ఇన్ని రోజుల తరువాతైనా అంతర్జాతీయ దేశాలు భారత్‌ మనోభావాలనుఅర్థం చేసుకోవడం మంచి పరిణామమని అబ్దుల్లా అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+