విజయవాడలో ఇద్దరు దుర్మరణం
హైదరాబాద్‌ః రాష్ట్రరాజధానికి కూతవేటుదూరంలో వున్న రంగారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో బాణామతి నెపంతో ఇద్దరిని గ్రామస్థులు దారుణంగా హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ కు చెందినగోరే మియా(60) బాణామతి చేస్తున్నాడని అనుమానించిన గ్రామస్తులు కొందరు అతని కుమారుడ్ని చెట్టుకు కట్టేశారు. అతనిని విడిపించుకొనేందుకు వచ్చిన గోరేమియాను కట్టెలతో చితకబాదారు. స్పృహతప్పి పడిపోయిన గోరేమియాను కుమారుడు ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేస్తుండగా గ్రామస్తులు మరోసారి దాడి చేసి రాళ్ళతో కొట్టి దారుణంగా హత్య చేశారు.












Click it and Unblock the Notifications
