హైదరాబాద్: రాష్ట్రంలో బయో టెక్నాలజీ పెట్టుబడులుపెట్టేవారికి ప్రోత్సహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు.
బయో టెక్నాలజీ అభివృద్ధికి అనుకూలంగా విధాన నిర్ణయాలు చేస్తామని, రాయితీలు ఇస్తామని ఆయన అన్నారు. ఔషధపరిశోధనలో ఆంధ్రప్రదేశ్ ముందున్నదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బయో టెక్నాలజీ రంగంలో పెట్టుబడులుపెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.