జమ్మూ: పాకిస్థాన్ నుంచి దాదాపుగా చొరబాట్లు ఆగిపోయాయని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ చెప్పారు. ఆయన శనివారం జమ్మూలో విస్తృతంగా పర్యటించారు. జవాన్లతో మాట్లాడారు.
నిర్దిష్ట కాలవ్యవధిలోసైన్యాన్ని ఉపసంహరిస్తామని చెప్పలేమని ఆయన అన్నారు. ఉద్రిక్తతలు సడలడమనేది పాకిస్థాన్ చేతుల్లోనే ఉన్నదని ఆయన అన్నారు. పాకిస్థాన్‌సైన్యం గానీ, మిలిటెంట్లు గానీ ఏ ఆయుధం వాడినా భారత్ ఎదుర్కుంటుందని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలను మూసేసే బాధ్యత ముషార్రఫ్‌దేనని ఆయన అన్నారు. ముషార్రఫ్ మాటలకు సాక్ష్యాలు కావాలని ఆయన అన్నారు. నియంత్రణ రేఖ వెంబడి అమెరికా,బ్రిటన్, మరే ఇతర మూడో దేశం పర్యవేక్షణనుఅంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.