ఇరాన్‌లో భూకంపం: 500 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను శనివారం పెను భూకంపం కుదిపేసింది. ఈ భూకంపానికి 500 మందికి పైగా బలయ్యారు. వేయి మందికి పైగా గాయపడ్డారు. ఓపెన్ ఎండెడ్ రిచర్ స్కేలుపై దీని తీవ్రత ఆరు డిగ్రీలుగా నమోదయింది.
భూకంపం మొదట భారత కాలమానం ప్రకారం ఉదయం గం.8.28 నిమిషాలకు బౌంజహ్రాలో వచ్చింది. ఆ తర్వాత ఉగయం 8.31 నిమిషాలకు వచ్చింది. భూకంపంలో గాయపడిన వారి సంఖ్య మరింతపెరిగే అవకాశాలున్నాయని, కచ్చితమైన లెక్కలుఅందుబాటులో లేవని, ఇంకా ఎంతో మంది మరణించి వుంటారని ఖాజ్విన్‌లోని రెడ్ క్రెసెంట్‌సొసైటీ అధిపతి మజీద్ శాల్విరి అన్నారు.
హమేదాన్ పొరుగున గల రజాన్‌లో ముగ్గురు మరణించారు; వంద మంది గాయపడ్డారు. ఆవాజ్‌లో గాయపడిన 120 మందితో ఆ ప్రాంతంలోని ఆస్పత్రులు నిండిపోయినట్లు అంతకు ముందు ఐఆర్‌ఎన్‌ఎ తెలిపింది. భూకంపంటెహ్రాన్, జిలాన్, అర్డెబిల్ ప్రొవిన్స్‌లను, జంజన్, కోర్దెస్థాన్ ప్రాంతాలను కూడా తాకింది.












Click it and Unblock the Notifications
