కాశ్మీర్‌లో ముగ్గురుమిలిటెంట్ల హతం
శ్రీనగర్: కాశ్మీర్‌లో తహ్రీక్- ఉల్- ముజాహిదీన్ జిల్లా కమాండర్‌తో పాటు ముగ్గురు ప్రధానమిలిటెంట్లు హతమయ్యారు. ఒక మిలిటెంట్‌అరెస్టయ్యాడు. మరో మిలిటెంటు లొంగిపోయాడు. ఈ సంఘటనలన్నీ శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు జరిగాయి.
కుప్వారా ప్రాంతంలోని దేవర్- లోలబ్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో విదేశీ చొరబాటుదార్లు ఉసామా జంగి, అబూ రెహ్మన్ హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి రెండు ఎకెరైఫిళ్లు, నాలుగు మాగజీన్లు, ఒక వైర్‌లెస్‌సెట్, ఆరు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆల్- ఫతే సంస్థకు చెందిన బిల్లాగా పేరు మోసిన రషీద్ గనాయ్ ఒక ఎకెరైఫిల్, రెండు మాగజీన్లు, 60 రౌండ్లు, రెండు చేతిబాంబులతోకుప్వారాలో సైనిక, పోలీసు అధికారుల ముందు లొంగిపోయాడు. అనంతనాగ్ జిల్లాలో హిజ్‌బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముస్తాక్ అహ్మద్ అలియాస్ షబ్నంనుసైన్యం అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications
