న్యూఢిల్లీః రాజకీయ వర్గాలు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న కేంద్రమంత్రి మండలి విస్తరణలో ఈ సారి హోం మంత్రి అద్వానీకి ఉపప్రధాని పదవి లభించే అవకాశం వుంది.
ఉపప్రధాని హోదాలోనే అద్వానీ హోం శాఖను నిర్వహిస్తారనివిశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఉపప్రధాని పదవి లేకపోయినప్పటికీ తొలి ప్రధాని నెహ్రూ నుంచి కూడాసీనియర్ సహచరునికి ఉపప్రధాని హోదా కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. మధ్యలో కొందరు ప్రధానులు దీనిని పట్టించుకోలేదు. అద్వానీని ఉపప్రధానిగా నియమించడం వల్లఎన్‌డిఎ సర్కారులో, బిజెపిలో వాజ్‌పేయి వారసత్వంపై సాగుతున్న ఊహలకు తెరపడుతుంది.