ఆన్‌లైన్ ద్వారాఫైళ్ల పరిష్కారం
హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా పెండింగ్‌ఫైళ్లను పరిష్కరించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం మంత్రుల, ఉన్నతాధికారుల సమావేశంలో ప్రకటించారు. పెండింగ్‌ఫైళ్ల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమావేశం జరిగింది.
రాష్ట్రంలో మొత్తం పది లక్షల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ఫైళ్లను నాలుగు కెటగిరీల కింద విభజించారు. ఇందులో 33.2 శాతం ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవి కాగా 14.2 శాతం కోర్టుల్లో నలుగుతున్నాయి. కోర్టుల్లో చిక్కుకున్నఫైళ్ల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. పెండింగ్‌ఫైళ్లు గుదిబండగా మారాయని ఆయన అన్నారు. ఆన్‌లైన్ ద్వారా పెండింగ్‌ఫైళ్ల పరిష్కారం ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.












Click it and Unblock the Notifications
