డిఎస్‌సి ప్రశ్న పత్రం లీక్ కాలేదు
హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జరిగిన డిఎస్‌సి- 2002 పరీక్షల ప్రశ్న ప్రతాలు లీక్ కాలేదని ప్రభుత్వ పాఠశాలవిద్యా శాఖ కార్యదర్శి ఐ.వి. సుబ్బారావు స్పష్టం చేశారు. 23, 24 తేదీల్లో డిఎస్‌సి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ప్రశ్న పత్రాలు ప్రకాశం జిల్లాలో లీక్‌అయినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చింది. దీంతో ఈవిషయమై సుబ్బారావు మంగళవారం వివరణ ఇచ్చారు.
కరీంనగర్ జిల్లాలో హాల్ టికెట్ల పంపిణీ వ్యవహారంపై గందరగోళం చెలరేగుతూనే ఉన్నది. రెండు ప్రయివేట్‌విద్యాసంస్థల చేత హాల్ టికెట్ల వ్యవహారం చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ పనులను పిల్లల చేత చేయించారనే ఆరోపణ కూడా వున్నది. ఈవిషయాన్ని ప్రయివేట్ విద్యాసంస్థలు కూడా అంగీకరించాయి. అయితే పిల్లల చేసిన పని పరిమితమేనని సంబంధిత అధికారులు చెప్పారు. ఇదంతా ఉన్నతాధికారులకు చెప్పే చేశామని కూడాఅంటున్నారు. ఈ విషయమై విచారణ జరిపిస్తామని, అవకతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని సుబ్బారావు చెప్పారు.












Click it and Unblock the Notifications
