విహెచ్‌పిని నిషేధించాలి:సంతులు
అయోధ్య:విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి)ని నిషేధించాలని అయోధ్యలోని ప్రముఖ సాధువులు, సంతులు డిమాండ్ చేశారు.
విహెచ్‌పి నిర్ణయం రాజ్యాంగ నిబంధన ఉల్లంఘన అని, ఇది మత ఉగ్రవాద సంస్కృతిని ప్రోత్సహిస్తుందని,అందువల్ల రాజ్యాంగాన్ని, కోర్టును ధిక్కరించే ఈ విధమైన బహిరంగ ప్రకటనలను సహించకూడదని సాధువుల, సంతుల, ముస్లిం నేతల సంయుక్త సమావేశం కన్వీనర్ మహంత్ యుగల్ కిశోర్ శాస్త్రి మంగళవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
హనుమాన్‌ఘరిలో దేవాలయంలో జరిగిన ఈ సమావేశానికి రామానంద సంప్రదాయానికి చెందిన జగద్గురు రామానందాచార్యస్వామి హర్యాచార్య అధ్యక్షత వహించారు. విహెచ్‌పి నిర్ణయం చట్ట వ్యతిరేక చర్యలకు, ఉగ్రవాదానికి దారి తీస్తుందని సమావేశం అభిప్రాయపడింది.ఆ విధమైన సంస్థను నిషేధించడం గానీ, ఆ సంస్థపై చట్టపరమైన చర్య గానీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ఆ సమావేశం ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications
