పాక్‌ పై మండిపడ్డ జి-8 దేశాలు

కాల్గరీః పాకిస్తాన్‌ భూభాగం నుంచి నడుస్తున్న తీవ్రవాద కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిందిగా జి-8 దేశాలు ముషారఫ్‌ ను కోరాయి. కెనడాలో జరిగిన జి-8 సదస్సు ఈ మేరకు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. పాక్‌ భూభాగం నుంచి జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలను నిలిపివేయని పక్షంలో ఉపఖండంలో శాంతి అసాధ్యం అని జి-8 చైర్మన్‌,కెనడా ప్రధాని జీన్‌ క్రిటెన్‌ చెప్పారు.

దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక దేశాల కూటమిఅయిన ఈ జి-8 ఈ సారి ఉమ్మడి ప్రకటనను మాత్రం విడుదల చేయలేదు. భారత - పాకిస్తాన్‌ లు సంయమనంతో వ్యవహరించాలని జి-8 హితోక్తి పలికింది. కాశ్మీర్‌అంశం పాక్‌ జాతి ప్రయోజనం అంటూ ముషారఫ్‌ చెలరేగి పోతున్న సమయంలోనే జి-8 దేశాలు ఇలా హితోక్తులు పలగడంవిశేషం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+