పార్టీ పదవికి జనా రాజీనామా
న్యూఢిల్లీ: మంత్రి వర్గ, పార్టీ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో జనా కృష్ణమూర్తి భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే మంత్రి పదవిస్వీకరించే విషయంలో ఆయన విభిన్న సూచనలుఅందించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తన వారసుడి ఎంపికకు వీలు కల్పిస్తూ కృష్ణమూర్తి పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామాను సమర్పించిన అనంతరం ఆయన చెన్నైకి వెళ్లిపోయారు. మంత్రి వర్గవిస్తరణకు ముందే ఈ నెల 29వ తేదీలోగా కొత్త పార్టీ అధ్యక్షుడిపేరు ప్రకటించవచ్చునని తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్యనాయుడిపేరుతో పాటు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, ప్రమోద్ మహాజన్‌పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పార్టీలోనూ, మంత్రి వర్గంలోనూ భారీ మార్పులు వుంటాయని ప్రధాని లక్నోలో ప్రకటించారు. ఈ ప్రకటన దృష్ట్యా యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్‌ల శాఖలు మారవచ్చునని ప్రచారం జరుగుతోంది. కృష్ణమూర్తి మంత్రి పదవి తీసుకుంటేఎం. వెంకయ్యనాయుడుకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు.
మంత్రి వర్గంలో తృణమూల్, పిఎంకెలను చేర్చుకుంటామని ప్రధాని ప్రకటించారు. ఈ దృష్ట్యా తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీకి మంత్రి పదవి ఖాయమని అనుకోవచ్చు.












Click it and Unblock the Notifications
