హైదరాబాద్: మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరుపీపుల్స్‌వార్ నక్సలైట్లు శుక్రవారం హైదరాబాద్ రేంజ్ డిఐజి సాంబశివరావు ఎదుట లొంగిపోయారు.
దుర్గయ్య, అమర్‌సింగ్ అనే ఈ ఇద్దరు నక్సలైట్లపై తలా మూడేసి కేసులు ఉన్నాయని సాంబశివరావు చెప్పారు. నక్సలైట్ల వైఖరి నచ్చక పోవడం వల్ల, కుటుంబ సమస్యల వల్ల తాము లొంగిపోయినట్లు ఈ ఇద్దరు నక్సలైట్లు చెప్పారు.