న్యూఢిల్లీ: హోం మంత్రి ఎల్.కె. అద్వానీ ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.
అద్వానీకి ఉప ప్రధాని పదవి ఇవ్వవచ్చునని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి రెండు దఫాలుగా సీనియర్ మంత్రి వర్గ సభ్యులతో చర్చించారు. మిత్ర పక్షాలతో కూడా చర్చలు జరిపారు. మంత్రి వర్గంలో చేరడానికి జనా కృష్ణమూర్తి ఎట్టకేలకుఅంగీకరించారు. ఈ విషయాన్ని ఆయన ప్రధాని వాజ్‌పేయికి, హోం మంత్రి అద్వానీకి తెలియజేశారు. అయితేఅందుకు ఆయన అసంతృప్తితోనే అంగీకరించారు.