చెన్నై: తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత జనా కృష్ణమూర్తి ఖండించారు. ప్రధాని ఆహ్వానిస్తే తాను మంత్రి వర్గంలో చేరడానికి సిద్ధమేనని ఆయన చెప్పారు.
పార్టీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, తనను మంత్రి వర్గంలో చేర్చుకుంటే పార్టీ అధ్యక్ష పదవి దానంతటదే పోతుందని ఆయన శనివారంవిలేకరులతో అన్నారు. ప్రధాని ఆహ్వానిస్తే తాను మంత్రి వర్గంలో చేరాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి జనా కృష్ణమూర్తి రాజీనామా చేసి చెన్నై వచ్చినట్లు శుక్రవారం రాత్రి నుంచి వార్తలు వెలువడుతున్నాయి. మంత్రి వర్గంలో చేరడానికి ఆయన ఇష్టంగా లేరని కూడా వార్తలు వస్తున్నాయి.