న్యూఢిల్లీ: హోం మంత్రి ఎల్.కె. అద్వానీని ఉప రాష్ట్రపతి పదవికి పోటీపెట్టవచ్చుననే వదంతుల నేపథ్యంలో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై కసరత్తు చేశారు.
ప్రధాని వాజ్‌పేయి మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జనా కృష్ణమూర్తితో మంతనాలు జరిపారు. జనా కృష్ణమూర్తిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడుకు, మరో కేంద్ర మంత్రి అనంతకుమార్‌కు పార్టీ బాధ్యతలుఅప్పగించే అవకాశాలున్నాయి. మంగళవారం మంత్రి వర్గ సమావేశానంతరం వాజ్‌పేయి జనా కృష్ణమూర్తితో మాట్లాడారు. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈవిషయాన్ని మంత్రి వర్గ సమావేశానంతరం పార్టమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్‌విలేకరులకు చెప్పారు.