ఏజెన్సీ ఉద్యోగులకు మంత్రి హెచ్చరిక
హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగులు పని చేసే చోట నివాసం ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ మంత్రి మణికుమారి హెచ్చరించారు. పని చేసే చోట నివాసం వుండని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆమె శనివారం సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు.
అన్యాక్రాంతమైన 64 ఎకరాల గిరిజన భూములను వన్ ఆఫ్‌సెవెంటీ కింద స్వాధీనం చేసుకుని తిరిగి గిరిజనులకుఅప్పగిస్తామని ఆమె చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోవికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications
