మోడి యాత్రను ఆపండి: సోనియా వినతి
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తలపెట్టిన గౌరవ రథ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని అటల్‌బిహారా వాజ్‌పేయిని కోరారు. ఇప్పటికే మత ఉద్రిక్తతలు చోటు చేసుకున్న గుజరాత్‌లో ఈ యాత్ర పరిస్థితిని మరింతవిషమింపజేస్తుందని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె వాజ్‌పేయికి ఒక లేఖరాశారు.
ఇటీవలి మత హింస వల్ల దేశ సాంఘిక చట్రం తీవ్రంగాదెబ్బ తిన్నదని, సామరస్యాన్ని పునరుద్ధరించి, బాధితుల్లో భద్రతా భావాన్నిపెంపొందించి, బాధితులకు పక్షపాత రహితంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంమీద ఉన్నదని ఆమె అన్నారు. గుజరాత్‌లో హింసకు కారణమైన సంస్థల గురించి మానవ హక్కుల కమిషన్, ఇతర సంస్థలు తెలిపాయని, రథ యాత్ర వల్ల హింసకు కారణమైన ఆ సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుందని, మైనారిటీల్లో అభద్రతా భావం పెరుగుతుందని సోనియా అన్నారు.












Click it and Unblock the Notifications
