హైదరాబాద్‌ః పీపుల్స్‌వార్ తో చర్చలను కొనసాగించే విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో వున్నదని హోం మంత్రి దేవేందర్‌గౌడ్ ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దిని శంకించవద్దని అసెంబ్లీలో గురువారం నాడు ఆయన విపక్షాలకు చెప్పారు.
రెండు విడతల పాటు జరిగిన చర్చల్లో వార్ అగ్రనేతలతోనే నేరుగా చర్చలు జరుపుతామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందనిఅందుకు వార్ ప్రతినిధులుగా చర్చల్లో పాల్గొన్నవారు కూడాఅంగీకరించారని ఆయన వెల్లడించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ నేతలు సభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా కదిపారు. నక్సల్స్‌తో చర్చల వ్యవహారంపై ఏమైందో తెలియక ప్రజలు అయోమయంలో వున్నారని వైఎస్ అన్నారు. ఈ చర్యల వ్యవహారంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయనకోరారు. నక్సలైట్లు తొలిసారిగా చర్చలకు సిద్ధమంటూ వచ్చారని దీనిని సద్వినియోగం చేసుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నదని సిపిఎం సభ్యుడు నోముల నర్సింహయ్య అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పే ప్రభుత్వం నక్సల్స్‌తో చర్చలవిషయంలో స్పష్టమైన వైఖరితో లేదని విపక్షాలువిమర్శించాయి. అయితే హోం మంత్రి మాట్లాడుతూ, 20న వార్ అగ్రనేతలు చర్చలకు వస్తారనే తాము భావిస్తున్నామని చెప్పారు. అయితే ఇంతవరకు ఎలాంటి సమాచారంఅందలేదని వెల్లడించారు. వార్ నక్సల్స్‌తో చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని ఆయన స్పష్టం చేశారు.