స్టట్‌గార్ట్ (జర్మనీ): దక్షిణ జర్మనీలో బోయింగ్ 757, తుపొలేవ్ 154విమానాలు ఆకాశంలో ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం71 మంది మృతి చెందారు.
మాస్కో నుంచి బార్సిలోనా బయలుదేరిన తుపొలేవ్ టియు-154విమానంలో 140 నుంచి 150 మంది ప్రయాణికులున్నారు. బోయింగ్ ఉత్తర ఇటలీలోని బహ్రేన్ నుంచి బెర్గామ్‌మీదుగా బ్రసెల్స్ వెళ్తోంది. ఇది కార్గో విమానం. ఇందులో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు మంగళవారం చెప్పారు.