వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్టు 12న ఉపరాష్ట్రపతి ఎన్నిక

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌ ః మెదక్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ధి కరణం ఉమాదేవి ఘనవిజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ధి శశిధర్‌రెడ్డిపై ఆమె 6960 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి పోచయ్య తృతీయ స్థానంలో నిలిచారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగించిన కారణంగా గురువారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే తుది ఫలితాలను అధికారులు ప్రకటించగలిగారు.

మొత్తం 15 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. మొదట మూడు రౌండ్లలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి ముందంజలో వున్నప్పటికీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. దాదాపు చివరకు ముగ్గురు అభ్యర్ధుల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. తెలుగుదేశం అభ్యర్ధి ఉమాదేవికి 43463 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధికి 36505 ఓట్లు పోలయ్యాయి. టిఆర్‌ఎస్‌ అభ్యర్ధికి 33756 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీపెద్దఎత్తునే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడింది. చతుర్విధోపాయలను ప్రయోగించివిజయాన్ని సొంతం చేసుకున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X