వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాజలాలపై ట్విన్‌ డెక్‌ బోట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పలు చర్యలు చేపడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ దిశగా మరో ముందడగు వేసింది. కృష్ణా జలాల్లో పర్యటకుల్ని రంజింపచేసే విధంగా డబుల్‌ డెక్‌ పడవను ప్రవేశపెట్టింది. 35 లక్షల రూపాలయ వ్యయంతో అత్యంత అథునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ పడవకువిజయసిరి అని పేరుపెట్టారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద ఈ పడవను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు.

ఈ పడవలో రెస్టారెంట్‌ కూడా వుంది. పార్టీలు, చిన్నచిన్నమీటింగ్‌ లు ఏర్పాటు చేసుకొనేందుకు వీలుగా కూడా ఈ పడవలో ఏర్పాటు చేశారు. పర్యాటకులు గంటసేపు ఈ పడవలో కృష్ణాజలాలపై విహారం చేయాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. తొలుత ఈ పడవకు అమరావతి అనిపేరు పెట్టినప్పటికీ తరువాత విజయసిరిగా పేరు మార్చారు. ఇప్పటికే నాగార్జునసాగర్‌, రాజధాని లోని హుస్సేన్‌ సాగర్‌ లలో పర్యాటక శాఖ ఇటువంటి పడవలను నడుపుతున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X