హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కాలుష్యాన్ని అరికట్టడానికి ఐదుటాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేయనున్నట్లు పర్యావరణ, అటవీ శాఖల మంత్రిసిహెచ్. అయ్యన్నపాత్రుడు చెప్పారు
వచ్చే నెల రోజుల్లో ఈటాస్క్‌ఫోర్సులు పని చేయడం ప్రారంభిస్తాయని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో అన్నారు. కళాశాలల, పాఠశాలలవిద్యార్థులకు కార్డులు ఇవ్వనున్నట్లు, కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని వారు ఆ కార్డుల్లో నింపి పంపితే తగిన చర్చలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.