వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఎస్‌ఆర్‌ అరెస్టుకు బిజెపి డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పీపుల్స్‌వార్‌తో చర్చల పట్ల ప్రభుత్వానికి ఆసక్తి లేదంటూపీపుల్స్‌వార్‌ ప్రతినిధులు వరవరరావు, గద్దర్‌ చేసిన ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారి ప్రకటన తప్పుదారి పట్టించేదిగా వున్నదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆదివారం ఒక అధికారిక ప్రకటన విడుదలయింది.

ప్రభుత్వానికి శ్రద్ధ లేదని చెబుతున్న వరవరరావు, గద్దర్‌ నక్సల్స్‌ చేస్తున్నఅరాచకాలను విస్మరిస్తున్నారని ప్రభుత్వం విమర్శించింది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని వేధిస్తున్న నక్సల్స్‌ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తన నిబద్ధతను ఎప్పటికప్పుడు పునరుద్ఘాటిస్తూనే ఉన్నదని స్పష్టం చేసింది. ఈ నిబద్ధతతోనేపీపుల్స్‌వార్‌తో చర్చల కోసం వార్‌ ప్రతినిధులతో మూడు దఫాలు తమ ప్రతినిధులు చర్చలు జరిపారని ప్రకటించింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతనువిస్మరించబోమని మొదటి నుంచి స్పష్టం చేస్తూనే వస్తున్నామని గుర్తు చేసింది. బెదిరింపులకు,బలవంతపు వసూళ్లకు, హింసాకాండకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని కూడా స్పష్టం చేస్తూ వస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది.

హింసాకాండను, బలవంతం వసూళ్లను ఆపేయాలని, గ్రామాల్లో ఆయుధాలతో తిరగవద్దని, చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం పదే పదేవిజ్ఞప్తి చేసినా పీపుల్స్‌వార్‌ పట్టించుకోలేదనివిమర్శించింది. చర్చల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడాపీపుల్స్‌వార్‌ హింసాకాండను ఆపలేదని ఆరోపించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X