కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ పేలుడు
నల్లగొండ: నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇంటిలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా పది మందికిస్వల్ప గాయాలయ్యాయి. గది పై కప్పు పెచ్చులూడి, శిథిలాలుమీద పడ్డాయి.
తిరుమలగిరి కార్యకర్తలు సంఘటనకు అరగంట ముందు వచ్చారు. మంచినీటి సమస్యపై దామోదర్ రెడ్డితోవిన్నవించుకునేందుకు వారు వచ్చారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడుసర్వోత్తమ్ రెడ్డి ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తుంగతుర్తి రావాల్సి ఉన్నది. శనివారం రాత్రి జిల్లా యువజన కాంగ్రెస్ నేత హత్యకు గురి కావడంతో వారి పర్యటన షెడ్యూల్ మారిపోయింది. దామోదర్ రెడ్డిని హతమార్చేందుకు ప్రత్యర్థులు బాంబుల వలవిసిరి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనంలో బాంబులు నిల్వ వుంచడం వల్ల ప్రమాదం సంభవించి వుండవచ్చుననే అభిప్రాయం కూడావినిపిస్తోంది.












Click it and Unblock the Notifications
