ఇసి చర్యలను త్రోసిపుచ్చిన పార్టీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను అఖిల పక్ష సమావేశం తిరస్కరించింది. నేర రాజకీయాలను అడ్డుకోవడానికి, ప్రజా జీవితంలో పారదర్శకతకు సమగ్ర చట్టం తేవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎన్నికల కమిషన్ మార్గదర్శక సూత్రాల మేరకు అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించే అధికారం రెవెన్యూ అధికారికి సంక్రమిస్తుందని, ఇది దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నదని మల్హోత్రా అన్నారు. నేర రాజకీయాలను అదుపు చేయడానికి ఒక చట్టం అవసరమని, అయితే న్యాయ వ్యవస్థ లేదా చట్టబద్ధ సంస్థ ఆదేశాలకు వదిలేయకూడదని కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ అన్నారు. క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం ఎన్నికల కమిషన్ మార్గదర్శక సూత్రాల స్థానంలో చట్టం తేవాలని రాజకీయ పార్టీలు చేసిన సూచనను ప్రభుత్వంఅంగీకరించిందని ఆయన చెప్పారు. ఇది అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
