హైదరాబాద్‌ః రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిథిలోని కాలేజీల్లో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ఎంట్రెన్స్ ఐసెట్ అభ్యర్ధులు ప్రభుత్వ అవకతవక విధానాలతో నానా ఇక్కట్లను ఎదుర్కుంటున్నారు.
ముందుగా కేంద్రీకృత అడ్మిషన్లు నిర్వహిస్తామని, ఆన్‌లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పిన అధికారులు ఆఖరు నిమిషయంలో చేతులెత్తేసి ఏ కాలేజీకి ఆ కాలేజీగా దరఖాస్తు చేసుకోవాలని అనడం అభ్యర్ధులు గగ్గోలెత్తి పోతున్నారు. ప్రతి కాలేజీకి విడిగాఅప్లయ్‌చేయడమంటే డబ్బు, కాలం రెండూ వృధాయేనని వారుఅంటున్నారు. ఆన్‌లైన్ కౌన్సిలింగ్ జరిపిస్తామని హామీలు గుప్పించిన ప్రభుత్వం ఇప్పుడు అభ్యర్ధుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని వారు ఆరోపిస్తున్నారు.