అగ్నిపరీక్ష కేసులో పదిమందిఅరెస్టు
హైదరాబాద్:పీపుల్స్‌వార్‌తో చర్చల పట్ల ప్రభుత్వానికి ఆసక్తి లేదంటూపీపుల్స్‌వార్ ప్రతినిధులు వరవరరావు, గద్దర్ చేసిన ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారి ప్రకటన తప్పుదారి పట్టించేదిగా వున్నదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆదివారం ఒక అధికారిక ప్రకటన విడుదలయింది.
హింసాకాండను, బలవంతం వసూళ్లను ఆపేయాలని, గ్రామాల్లో ఆయుధాలతో తిరగవద్దని, చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం పదే పదేవిజ్ఞప్తి చేసినా పీపుల్స్‌వార్ పట్టించుకోలేదనివిమర్శించింది. చర్చల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడాపీపుల్స్‌వార్ హింసాకాండను ఆపలేదని ఆరోపించింది.












Click it and Unblock the Notifications
