కేంద్రాన్ని భారీసాయం కోరిన ఆంధ్ర

న్యూఢిల్లీః కరవు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ కు భారీగా నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ఇద్దరు మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రిఅశోక్‌ గజపతి రాజు సోమవారం కొత్తఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి అజిత్‌ సింగ్‌ ను కలుసుకున్నారు. రాష్ట్రంలో కరవు తీవ్రతను ఇద్దరు మంత్రులు అజిత్‌ సింగ్‌ కువివరించారు.

రాష్ట్రాన్ని కరవు కోరల నుంచి బయటపడేసేందుకు 810 కోట్ల రూపాయల సాయంఅందించాలని, 15 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించాలని కూడా వారు కేంద్ర మంత్రినికోరారు. ఇందుకు అజిత్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించినట్లు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆ తరువాతవిలేకర్లకు తెలిపారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాన్ని కూడా పంపే అవకాశం వున్నదనిఅశోక్‌ గజపతి రాజు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+