Women Bill: పరువు పొగొట్టుకున్న ఏపీ పార్టీలు-దక్షిణాదికి వ్యతిరేకంగా వెళ్లి..!

మహిళా రిజర్వేషన్ల అమలు (women bill), దాంతో పాటు నియోజకవర్గాల పునర్విభజనకు వీలుగా రాజ్యాంగ సవరణ కోసం కేంద్రం తెచ్చిన బిల్లు ఇవాళ లోక్ సభలో వీగిపోయింది. లోక్ సభలో మూడింట రెండొంతుల మెజార్టీకి అవసరమైన 352 ఓట్లను సాధించడంలో కేంద్రం విఫలమైంది. కేవలం 298 ఓట్లు మాత్రమే సాధించింది. విపక్షాలు 230 ఓట్లు తెచ్చుకున్నాయి. దీంతో ఈ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షాల్లో ఉన్న టీడీపీతో పాటు ఏ కూటమిలో లేని వైఎస్సార్సీపీ కూడా మద్దతిచ్చింది. అయితే బిల్లు ఓటమిపాలవ్వడంతో కేంద్రంతో పాటు టీడీపీ, వైసీపికి (tdp, ysrcp) కూడా షాక్ తప్పలేదు.

మహిళా బిల్లుకు షాక్-ఎన్డీయే నిరసనలు.! మద్దతుకు రాహుల్ షరతు..!
మహిళా బిల్లుకు షాక్-ఎన్డీయే నిరసనలు.! మద్దతుకు రాహుల్ షరతు..!

కేంద్రం ఎప్పుడైతే మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా తెచ్చే ప్రయత్నం చేసిందో అప్పుడే దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్, డీఎంకే, మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. కేరళలో ఎల్టీఎఫ్, యూడీఎఫ్ కూటములు, కర్నాటకలో అధికార కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, మిత్రపక్షాలు, తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ ఇలా పలు పార్టీలు ఈ బిల్లుల్ని వ్యతిరేకించాయి. అయితే ఏపీలో మాత్రం అధికార టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా మద్దతిచ్చింది. ఇప్పుడు బిల్లు వీగిపోవడంతో ఆంధ్రా పార్టీలు పరువు పోగొట్టుకున్నట్లయింది.

Setback for Andhra s TDP YSRCP After Bill Linking Women s Quota to Seat Hike Fails in Parliament
కేంద్రానికి భారీ షాక్- లోక్ సభలో వీగిపోయిన మహిళా బిల్లు..!
కేంద్రానికి భారీ షాక్- లోక్ సభలో వీగిపోయిన మహిళా బిల్లు..!

ముందు నుంచీ ఈ బిల్లుల్ని, వాటికి మద్దతిస్తున్న ఏపీ పార్టీల్ని తప్పుబడుతున్న వైఎస్ షర్మిల.. బిల్లులు వీగిపోయిన అనంతరం స్పందించారు. మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ చేసిన మాయోపాయం పారలేదని, అక్రమ చట్టాలకు అవనిని అడ్డుపెట్టి ఆమోదించాలనే కుతంత్రం నిలబడలేదని ట్వీట్ చేశారు. సాధికారిత పేరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయాలనే బీజేపీ కుయుక్తులు చెల్లలేదన్నారు. ఎన్డీయే అధర్మంపై, ఇండియా ధర్మయుద్ధం గెలిచిందన్నారు. ప్రజాస్వామ్యం నిలబడిందని,ఇది భారత దేశ ప్రజల విజయమని పేర్కొన్నారుర. బీజేపీ రాజకీయ దురుద్దేశ్యానికి ఇది నిజంగా చరమ గీతమని, మహిళల పేరుతో నీచ రాజకీయాలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీజీకి, మత పిచ్చి బీజేపీకి ఇది చెంపపెట్టు అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+